ఫాలోఆన్ ప్రమాదంలో భారత్.. ఈ సారి కూడా గట్టేక్కేనా..?
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.
దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు మ్యాచ్ లో భారీ స్కోర్ చేసిన ఆ జట్టు రెండో రోజు మొదటి సెషన్ తర్వాత ఆలౌట్ అయింది. అనంతరం భ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు కీలక బ్యాటర్లను తక్కువ పరుగులకు అవుట్ చేసి.. బౌలింగ్‌లోని తమ హవా కొనసాగించింది. దీంతో భారత్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి.. 46 ఓవర్లు ఆడి.. 164 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
దీంతో భారత జట్టు మరోసారి ఫాలో ఆన్(Follow on) ప్రమాదానికి దగ్గరగా ఉంది. ఆస్ట్రేలియా(Australia) మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. దీంతో భారత్(India) ఫాలోఆన్ నుంచి తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మూడో టెస్టులో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న ఆకాష్ దీప్ చాకచక్యంగా బ్యాటింగ్ చేసి... భారత్ ను ఫాలో ఆన్ నుంచి తప్పించాడు. దీంతో ఆ టెస్ట్ డ్రాగా ముగిసింది. కాగా నాలుగో టెస్టులో ప్రస్తుతం పంత్ 6*, జడేజా 4*పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.