Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో పాక్ కంటే వెనుకబడ్డ భారత్.. కారణం ఏంటో తెలుసా?

పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు గెలిచింది.

Update: 2024-08-09 16:19 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు గెలిచింది. అందులో ఓ రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క పతకమే సాధించింది. కానీ, మెడల్ టేబుల్‌లో భారత్‌ను వెనక్కినెట్టింది. భారత్ 65వ స్థానంలో ఉంటే పాక్ 54వ స్థానంలో ఉన్నది. భారత్ కంటే 11 స్థానాలు ముందుంది. అందుకు కారణం పాక్ స్వర్ణం గెలవడమే. ఒలింపిక్స్ నిర్వాహకులు స్వర్ణ పతకాల ఆధారంగానే మెడల్ టేబుల్‌లో ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. భారత్ ఇప్పటివరకు ఒక్క స్వర్ణమూ సాధించలేదు. పాక్ గెలుచుకుంది ఒక్క పతకమే అయినా అది బంగారు పతకం. జావెలిన్ త్రోలో నదీమ్ అర్షద్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఒక్క గోల్డ్ మెడల్‌తో పాక్.. భారత్ కంటే ముందు స్థానంలో నిలిచింది. 

Tags:    

Similar News