Brisbane: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు డ్రా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా బ్రిస్బేన్(Brisbane) వేదికగా భారత్, ఆస్ట్రేలియా(Australia) మధ్య జరుగుతోన్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

Update: 2024-12-18 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా బ్రిస్బేన్(Brisbane) వేదికగా భారత్, ఆస్ట్రేలియా(Australia) మధ్య జరుగుతోన్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 445 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్(India) 260 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 89/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత్ ఎదుట 275 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత్ ఎనిమిది పరుగులు చేసేలోపు సమయం ముగిసింది. దీంతో టెస్టు డ్రా అయింది. మొత్తం ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తో సమం చేశాయి. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ట్రావిస్ హెడ్ నిలిచారు.

Tags:    

Similar News