దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రొటిస్ జట్టుతో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. ఇక రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా ప్రకటించింది.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్.