IND Vs AUS: యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ.. భారత్ విజయ లక్ష్యం ఇదే!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్ చివరి రోజు రసవత్తరంగా సాగుతోంది.

Update: 2024-12-30 03:33 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్ చివరి రోజు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్సింగ్స్‌లో 234 పరుగుకు ఆలౌట్ అయిన కంగారూ జట్టు టీమిండియా (Team India) ముందు 340 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఆసిస్ బ్యాట్స్‌మెన్లలో మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) 70, పాట్ కమిన్స్ (Pat Cummins) (41), నాథల్ లయన్ (Nathan Lyon) (41) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా (Jasrpeet Bumrah) 5, మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 3, రవీంద్ర జడేజా (Ravindra Jadeja 1 వికెట్ తీసుకున్నారు.

అనంతరం 340 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా (Team India)కు ఆదిలోనే ఊహించని షాక్ గిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) పేలవ ఫాం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అతడు 40 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి పాట్ కమిన్స్ (Pat Cummins) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా ఉన్నాడు. రోహిత్ అవుటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ (KL Rahul) అదే కమిన్స్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవీలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 5 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ (India) 3 కీలక వికెట్లను కోల్పోయి 92 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) 132 బంతుల్లో 55 పరుగులు, రిషభ్ పంత్ (Rishabh Pant) 49 బంతుల్లో 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే మరో 247 పరుగులు చేయాలి. 

Tags:    

Similar News