IND Vs AUS: చివరి టెస్ట్‌లోనూ మారని తీరు.. మరోసారి కష్టాల్లో టీమిండియా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న చివరి టెస్ట్‌లో మరోసారి టీమిండియా (Team India) కష్టాల్లో పడింది.

Update: 2025-01-03 03:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న చివరి టెస్ట్‌లో మరోసారి టీమిండియా (Team India) కష్టాల్లో పడింది. ఫస్ట్ సెషన్‌లోనే 4 కీలక వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అయితే, గత నాలుగు టెస్ట్‌లలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma)ను అనుకున్నట్లుగానే తుది జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) జట్టులో చేరాడు. కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు అప్పగించారు. ఇక గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) స్థానంలో మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna)ను తీసుకున్నారు. అయితే, అంతకు మందు టాస్ గెలిచిన కెప్టెన్ బుమ్రా ఏమాత్రం సంకోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఒపెనర్లు యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal), కేఎల్ రాహుల్ (KL Rahul) ఆసిస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఇన్సింగ్ 11 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (4) పరుగులు చేసి స్కాట్ బోలాండ్ (Scott Boland) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (10) పరుగులు చేసి మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు. అదేవిధంగా శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) (20) పరుగులు చేసి స్పిన్నర్ నాథన్ లయన్ (Nathan Lion) చేతికి చిక్కాడు. బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) (17) పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో అవుటయ్యడు. ప్రస్తుతం టీమిండియా 4 కీలక వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (Rishabh Pant) 38 బంతుల్లో 14 పరగులు, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 38 బంతుల్లో 14 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. ఇక ఆసిస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ చెరో వికెట్ దక్కింది. 

Tags:    

Similar News