IND vs AUS 4th టెస్ట్ డ్రా అయితే.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఏమ్ జరుగుతుంది..?
భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది.
దిశ, వెబ్‌డెస్క్: భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆ టెస్ట్ డ్రాగా ముగిసిపోతే.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఏం జరుగుతుంది అనే దానిపై ప్రతిఒక్క క్రికెట్ అభిమాని మనసులో సందేహం నెలకొంది. కాగా WTC పాయింట్స్ టేబుల్ లో భారత్ ప్రస్తుతం 60.29 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒక వేల ఆస్ట్రేలియాతో జరుగనున్న నాలుగో టెస్టు డ్రా అయితే.. భారత్ 58.79 పాయింట్లకు పడిపోతుంది.
ఒకవేళ ఈ టెస్టులో భారత్ ఓడిపోతే.. 56.94 పాయింట్లకు పడిపోతుంది. అలా జరిగితే న్యూజిలాండ్-శ్రీలంక టెస్ట్ సిరీస్ ఫలితాలపైనే భారత్ ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ శ్రీలంక మధ్య జరుగున్న టెస్ట్ సిరీస్‌ను వైట్‌వాష్ చేయడంలో శ్రీలంక విఫలమైతే, భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా WTC పాయింట్ల టేబుల్ లో ఉన్న టాప్ 2 టీమ్స్ ఫైనల్ ఆడుతాయి.