ICC World Cup 2023: ట్రెంట్ బౌల్ట్ స్టన్నింగ్ క్యాచ్..

Update: 2023-10-09 14:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. రచిన్ రవీంద్ర వేసిన 16 ఓవర్‌లో 4 బాల్‌కి బాస్ ది లీడె భారీ షాట్ ఆడగా.. ఆ క్యాచ్‌ను అందుకునే క్రమంలో ట్రెంట్ బౌల్ట్ బౌండరీ అవతలికి పడబోయాడు. చురగ్గా స్పందించి బంతిని మరోసారి గాల్లోకి విసిరి, పట్టుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నెదర్లాండ్స్ 30 ఓవర్‌లకు 4 వికెట్లు కోల్పోయి 145 రన్స్ చేసింది. కోలిన్ అకెర్మాన్ (63), స్కాట్ ఎడ్వర్డ్స్ (13) పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్‌లకు 7 వికెట్లు కోల్పోయి 322 రన్స్ చేసింది. యంగ్‌, రచిన్‌, లాథమ్‌.. హాఫ్ సెంచరీలతో చెలరేగగా న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్స్‌లో కాన్వే 32, యంగ్ 70 (7 ఫోర్లు, 2 సిక్సర్‌లు), రచిన్ 51 (3 ఫోర్లు, 1 సిక్సర్‌), మిచెల్ 48, లాథమ్ 53 పరుగులతో రాణించగా భారీ స్కోరు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్‌లో.. మీకెరెన్, మెర్వే, ఆర్యన్ తలో 2 వికెట్లు తీయగా. ఆల్‌రౌండర్‌ బాస్‌ డి లిడేకు ఒక వికెట్‌ దక్కింది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు డెవాన్‌ కాన్వే(32), విల్‌ యంగ్‌ శుభారంభం అందించారు.

గత మ్యాచ్‌ సెంచరీ హీరో, వన్‌డౌన్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర ఈసారి 51 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన డారిల్‌ మిచెల్‌ 48, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 53 పరుగులతో అదరగొట్టారు. అయితే ఈ మ్యాచ్లో గ్లెన్‌ ఫిలిప్స్‌(4) పూర్తిగా నిరాశపరచగా.. మార్క్‌ చాప్‌మన్‌ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిదో స్థానంలో వచ్చిన మిచెల్‌ సాంట్నర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.


Similar News