ICC World Cup 2023 Final: స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు.. భారమంతా అతడిపైనే..
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023 Finalల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలోనే ముగ్గురు కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. ఆది నుంచి తడబడుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్(4) స్టార్క్ బౌలింగ్‌లో ఆడం జంపాకు తేలికైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ(47) ధాటిగా ఆడే క్రమంలో మాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్ చేతికి చిక్కాడు. ఆ కాసేపటికే శ్రేయస్ అయ్యర్(4)ను కమిన్స్ వెనక్కి పంపాడు. దీంతో 81 పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(32), కేఎల్ రాహుల్(8) ఆడుతున్నారు. వరుసగా వికెట్లు పడడంతో వీళ్లిద్దరూ భాగస్వామ్యం నిర్మించే బాధ్యత తీసుకున్నారు. 15 ఓవర్లకు భారత్ స్కోర్.. 97/3.