SPORTS: ఐర్లాండ్ బ్యాటర్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ

ఐర్లాండ్ వర్సెస్ జింబాంబ్వే మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ లో అతిథ్య ఐర్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Update: 2024-07-30 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఐర్లాండ్ వర్సెస్ జింబాంబ్వే మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ లో అతిథ్య ఐర్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే మూడు వికెట్ల కోల్పోయి ఆపదలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన హరీ టెక్టర్ , తాను ఎదురుకొన్న 6వ బంతి తన బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ చేతిలో పడింది. దీంతో వెంటనే అంపైర్ బ్యాటర్ అవుట్ అయినట్లు ప్రకటించాడు. కానీ, ఐర్లాండ్ బ్యాటర్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ 24 ఏళ్ల ఆటగాడు అంపైర్ వైపు వేలు చూపిస్తూ క్రీజు వదలకుండా అక్కడే కాసేపు ఉండిపోయాడు.

కాగా, అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అతనిపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తన మ్యాచ్ ఫీజ్లో 15 శాతం జరిమానా, అలాగే ICC ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 ఉల్లంఘన కింద అతనికి ఒక డీ మెరిట్ పాయింట్ విధించారు. చేసిన తప్పును అతను గ్రహించి, మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ ప్రతిపాదించిన పెనాల్టీని అంగీకరించాడు. 


Similar News