ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌ కీలక నిర్ణయం..

వన్డే వరల్డ్‌ కప్‌ సన్నాహాల్లో భాగంగా మాజీ కెప్టెన్.. కోచ్‌గా అనుభవజ్ఞుడైన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ను న్యూజిలాండ్‌ జట్టు తమ కోచింగ్‌ బృందంలోకి చేర్చింది.

Update: 2023-08-24 09:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్‌ కప్‌ సన్నాహాల్లో భాగంగా మాజీ కెప్టెన్.. కోచ్‌గా అనుభవజ్ఞుడైన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ను న్యూజిలాండ్‌ జట్టు తమ కోచింగ్‌ బృందంలోకి చేర్చింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదుసార్లు విజేతగా నిలవడంలో కోచ్‌గా కీలకపాత్ర పోషించాడు ఫ్లెమింగ్‌. ఈ నేపథ్యంలో భారత గడ్డపై ఉన్న అపార అనుభవం తమ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని కివీస్‌ బోర్డు భావించింది.

వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, పోస్టర్‌ కోచింగ్‌ బాధ్యతలు చెపట్టనున్నాడు. అదే విధంగా సక్లాయిన్‌ కివీస్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఆగస్టు 30 నుంచి కివీస్‌.. ఇంగ్లండ్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో భాగంగా న్యూజిలాండ్‌ అతిథ్య ఇంగ్లండ్‌తో నాలుగు టీ20లు , నాలుగు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్‌ పర్యటన సెప్టెంబర్‌ 15న ముగయనుంది.


Similar News