పాండ్యాతో విభేదాలు.. స్పందించిన సూర్యకుమార్
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌కు డిప్యూటీగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌కు డిప్యూటీగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించిన విషయం తెలిసిందే. గతంలో టీ20 జట్టును నడిపించిన హార్దిక్ పాండ్యాకు బదులు అక్షర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడంతో సూర్యకు, పాండ్యాకు విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను సూర్యకుమార్ ఖండించాడు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాండ్యాతో తన రిలేషన్ బాగానే ఉందన్నాడు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పాడు. ‘మా ఇద్దరిది సుదీర్ఘ ప్రయాణం. జట్టుకు ఏం కావాలో మాకు తెలుసు. అక్షర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. లీడర్‌షిప్ గ్రూపులో పాండ్యా కూడా భాగమే. మైదానంలో మనకు చాలా మంది కెప్టెన్లు ఉన్నట్టే.’అని సూర్య వ్యాఖ్యానించాడు.