కోహ్లీ ఒక్క సెంచరీ చెయ్.. అంతా మర్చిపోతారు : హర్భజన్ సింగ్
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు.

దిశ, స్పోర్ట్స్ : ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. శనివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నేటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.‘కోహ్లీకి ఇంతకంటే మంచి చాన్స్ ఉండదు. పాక్‌పై సెంచరీ చేస్తే గత నాలుగైదు నెలలు ఏం జరిగిందో అందరూ మర్చిపోతారు. విరాట్ రాణిస్తాడనుకుంటున్నా. రేపు విరాట్ రోజు. కోహ్లీ పరుగులు చేసిన ప్రతిసారి భారత్ గెలిచింది.’ అని వ్యాఖ్యానించాడు. నేటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా అభిప్రాయపడ్డాడు. భారత బ్యాటింగ్, బౌలింగ్ బాగుందని, దుబాయ్‌లో గత మ్యాచ్ ఆడిన అనుభవం కూడా కలిసివస్తుందని చెప్పాడు.