ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌‌‌‌‌ను ఐదు పతకాలతో ముగించిన భారత్

ఇరాన్‌లో జరుగుతున్న ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఐదు పతకాలతో ముగించింది.

Update: 2024-02-19 18:52 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇరాన్‌లో జరుగుతున్న ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఐదు పతకాలతో ముగించింది. సోమవారం భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక రజతం చేరాయి. పురుషుల 3,000 మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించాడు. వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసిన గుల్వీర్ సింగ్ 8:07.48 సెకన్లలో రేసును ముగించాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది నాలుగో బంగారు పతకం. మహిళల 1500 మీటర్ల రేసులో హర్మిలన్ బైన్స్, మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి, పురుషుల షాట్‌ఫుట్‌లో తాజిందర్‌పాల్ సింగ్ తోమర్ స్వర్ణ పతకాలు సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు, మహిళల 3,000 మీటర్ల ఈవెంట్‌లో అంకిత ధ్యాని రజత పతకం సాధించింది. అంకిత 9:26:22 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. జపాన్ అథ్లెట్ యుమా యమమోటో(9:16:71 సెకన్లు) గోల్డ్ మెడల్ గెలుచుకుంది. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ ఐదు పతకాలు సాధించగా.. అందులో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం ఉన్నాయి. మెడల్స్ టేబుల్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. చైనా 15 పతకాలతో అగ్రస్థానంలో నిలువగా.. కజకిస్తాన్ 10 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. 

Tags:    

Similar News