అతడి ఓవరాక్షన్ వల్లే గుజరాత్ ఓడింది.. వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 Final మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ కారణమని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమవ్వగా.. రవీంద్ర జడేజా సంచలన బ్యాటింగ్‌తో 6, 4 బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఫలితంపై మాట్లాడిన సెహ్వాగ్.. గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తప్పుబట్టారు. చివరి ఓవర్‌ను మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా.. అనవసరంగా అతన్ని హార్దిక్, నెహ్రా డిస్టర్బ్ చేశారని.. వారిపై సెహ్వాగ్ మండిపడ్డాడు.
'మోహిత్ శర్మ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ, యార్కర్లు వేస్తున్నప్పుడు.. హార్దిక్ పాండ్యా అతని దగ్గరకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏం ఉంది? అని ఫైర్ అయ్యారు. హార్దిక్ వెళ్లి అనవసర సలహాలు ఇవ్వడం ఎందుకు? హార్ధిక్ పాండ్యా వెళ్లి డిస్టర్బ్ చేయడం వల్లే మోహిత్ శర్మ రిథమ్ దెబ్బతిన్నది. అతన్ని అలాగే వదిలేసి ఉంటే కచ్చితంగా గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించి ఉండేవాడు. కనీసం ఇంకో బంతి వేసేదాకా అయినా అతన్ని వదిలేసి ఉండాల్సింది.' అని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.