ఫిఫా వరల్డ్ కప్: ఆసీస్‌ను చిత్తు చేసిన ఫ్రాన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఘనమైన ఆరంభం
ఫిఫా వరల్డ్ కప్‌లో గ్రూప్-డీలో భాగంగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మధ్య - France beat Australia 4-1 in their first game
దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా వరల్డ్ కప్‌లో గ్రూప్-డీలో భాగంగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఆసీస్‌ను 4-1తో చిత్తు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఈసారి తన ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. ఆట మొదలైన 9వ నిమిషంలోనే ఆసీస్ ప్లేయర్ క్రెగ్ గుడ్‌విన్ అద్భుతమైన గోల్ చేశాడు. దీంతో ఆ జట్టు ఫ్రాన్స్‌పై 1-0 ఆధిక్యం సాధించింది. ఫ్రాన్స్.. 27వ నిమిషంలో ఆడ్రియన్ రాబియట్ తొలి గోల్ సాధించాడు. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మరో ఐదు నిమిషాల తర్వాత ఫ్రాన్స్ స్టార్ ఆలివియర్ గిరోడ్ మరో గోల్ చేయగా.. ఫ్రాన్స్ ఈ మ్యాచ్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకండ్ హాఫ్‌లో 68వ నిమిషంలో ఎంబాపే అద్భుతమైన హెడర్‌తో మరో గోల్ చేశాడు. దీంతో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఫ్రాన్స్. ఐదు నిమిషాల వ్యవధిలోనే మరోసారి ఆలివియర్ గిరోడ్ మరో గోల్ చేశాడు. చివరకు ఫ్రాన్స్ జట్టు 4-1 తేడాతో ఆస్ట్రేలియా టీం ను చిత్తుగా ఓడించింది.