రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటేనే T20 వరల్డ్ కప్ సాధించగలం: మాజీ కెప్టెన్

టీమిండియా ఫ్యాన్స్‌ అంతా టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Update: 2024-01-07 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఫ్యాన్స్‌ అంతా టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2023లో వన్డే వరల్డ్ కప్‌‌ను స్వదేశంలో చేజేతులా పోగొట్టుకోవడంతో ఎలాగైనా పొట్టి కప్ సాధించి తీరాలని అటు ఆటగాళ్లతో పాటు బీసీసీఐ యాజమాన్యం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిష్టా్త్మక సిరీస్‌లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ ఉంటారనే దానిపై ఇప్పటికే క్లారిటీ రాగా.. తాజాగా.. అటు ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రీడాకారులు కూడా ఓ ఆసక్తికర డిమాండ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండాల్సిందే అని టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ ఒక గొప్ప లీడర్, వన్డే వరల్డ్ కప్‌లో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లోనూ హిట్‌మ్యాన్ జట్టు పగ్గాలు చేపట్టి ఎలాగైనా కప్ కొట్టాలి. అలాగే విరాట్ కోహ్లీ కూడా వరల్డ్ కప్‌ వరకైనా టీ20లు ఆడాలని కోరాడు. వీరిద్దరి ప్రసెన్స్ జట్టుకు ఎంతో బలాన్నిస్తుంది’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News