Ashes 2023: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్‌.. సిరీస్‌ మొత్తానికి కీలక ప్లేయర్‌ ఔట్

Ashes 2023 సిరీస్‌లో ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2023-07-04 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023 సిరీస్‌లో ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌ వైస్‌ కెప్టెన్‌ ఓలీ పోప్‌‌కుడి భుజం నొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమైనట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఆసీస్‌తో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ అతడు మిగిలిన మ్యాచ్‌లలో అందుబాటులో ఉండడని పేర్కొంది. లండన్‌లో స్కానింగ్‌ చేయించగా.. అతడి గాయం మరింత తీవ్రతరమైందని తేలింది. సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది.


Similar News