Fencing World Championships: షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరణ.. టోర్నీ నుంచి ఔట్‌!

మిలాన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఉక్రేనియన్ ఫెన్సర్ ఓల్గా ఖర్లాన్ అనర్హత వేటు పడింది.

Update: 2023-07-28 09:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: మిలాన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఉక్రేనియన్ ఫెన్సర్ ఓల్గా ఖర్లాన్ అనర్హత వేటు పడింది. ప్రత్యర్ది రష్యన్‌ ఫెన్సర్స్‌ అన్నా స్మిర్నోవాతో షేక్‌ హ్యాండ్‌ చేసేందుకు నిరాకరించడంతో ఆమెను ఈ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి తప్పించారు. గరువారం జరిగిన మ్యాచ్‌లో స్మిర్నోవాపై 15-7 తేడాతో ఖర్లాన్ విజయం సాధించింది.

అయితే మ్యాచ్‌ పూర్తి అయిన తర్వాత స్మిర్నోవా.. ఓల్గాకు షెక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు ఆసక్తి చూపింది. కానీ ఓల్గా ఖర్లాన్ మాత్రం అందుకు విముఖత చూపింది. గతేడాది ఫిభ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన దేశానికి మద్దతుగా షెక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ఓల్గా నిరకారించింది. "మాపై ఎటువంటి చర్యలు తీసుకున్న పర్వాలేదు. మేము ఎప్పటికి వారితో(రష్యా) చేతులు కలపం" అంటూ తనపై వేటు పడిన అనంతరం ఓల్గా వాఖ్యనించింది.


Similar News