దినేష్ కార్తీక్ నన్ను చాలా చికాకు పరుస్తాడు: రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దినేష్ కార్తీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ మైదానంలో తనను చాలా చికాకుపరుస్తాడని చెప్పుకొచ్చాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దినేష్ కార్తీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ మైదానంలో తనను చాలా చికాకుపరుస్తాడని చెప్పుకొచ్చాడు. దీనికి భారత మాజీ పేస్ బౌలర్ ఎస్ శ్రీశాంత్.. స్పందించాడు.. "వికెట్ల మధ్య పరుగులు చేయడం రోహిత్ కార్తీక్‌తో కలిసి ఆనందించే విషయం కాదు, కానీ మైదానం వెలుపల, కార్తీక్ చాలా మధురమైన వ్యక్తి, అతను ఎల్లప్పుడూ మీ కోసం ఉంటాడు. కాబట్టి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది" అని భారత మాజీ పేసర్ అన్నాడు.