హర్భజన్ ను ఐపీఎల్ నుంచి తొలగించాలని డిమాండ్
ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బౌలర్ జోఫ్రా ఆర్చర్ పై కామెంటేటర్ హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లో సన్ రైజర్స్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బౌలర్ జోఫ్రా ఆర్చర్ (Bowler Jofra Archer) పై కామెంటేటర్ హర్భజన్ సింగ్ (Commentator Harbhajan Singh) వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial comments) చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్చర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో, హర్భజన్ కామెంటరీలో భాగంగా, "లండన్‌లో కాలీ టాక్సీ కా మీటర్ తేజ్ భాగ్తా హై, ఔర్ యహా పే ఆర్చర్ సాహబ్ కా మీటర్ భీ తేజ్ భాగా హై" (లండన్‌లోని బ్లాక్ టాక్సీ మీటర్ వేగంగా నడుస్తుంది. ఇక్కడ ఆర్చర్ సాహబ్ మీటర్ కూడా వేగంగా నడిచింది) అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఆర్చర్ ప్రదర్శనను (అతను 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు) సూచిస్తూ చేసినప్పటికీ, "బ్లాక్ టాక్సీ" (Black Taxi) అనే పదం వాడటం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు (Severe criticism) దారి తీసింది.
సీనియర్ ప్లేయర్ అయిన హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా మంది అభిమానులకు అసహనాన్ని కలిగించాయి. దీంతో వారు సోషల్ మీడియా (Social media) లో హర్భజన్‌ను విమర్శిస్తూ, ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్ నుంచి అతన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అలాగే మరికొందరు హర్భజన్ సరదా చేసిన ఈ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 286/6 స్కోరు సాధించి.. రాజస్థాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది. కాగా ఈ మ్యాచులో ఆర్చర్ ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్‌గా నిలిచిపోయింది.