డేవిస్ కప్‌లో స్వీడన్ చేతిలో భారత్ ఓటమి

స్వీడన్‌లో స్టాక్‌హోమ్ వేదికగా జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత్‌కు నిరాశే ఎదురైంది.

Update: 2024-09-15 14:33 GMT

దిశ, స్పోర్ట్స్ : స్వీడన్‌లో స్టాక్‌హోమ్ వేదికగా జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత్‌కు నిరాశే ఎదురైంది. రెండు రోజులపాటు జరిగిన వరల్డ్ గ్రూపు 1 టై పోరులో స్వీడన్ చేతిలో 4-0 తేడాతో పరాజయం పాలైంది. శనివారం సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత స్టార్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ, రామ్‌కుమార్ రామనాథన్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆదివారం కీలకమైన డబుల్స్ మ్యాచ్‌లోనూ శ్రీరామ్, రామ్‌కుమార్ జోడీ తేలిపోయింది. స్వీడన్‌కు చెందిన ఆండ్రీ గోరాన్సన్-ఫిలిప్ బెర్గేవి జోడీ చేతిలో 6-3, 6-4 తేడాతో ఓడిపోవడంతో భారత్ ఓటమి ఖరారైంది. రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్‌పై 2-6, 2-6 తేడాతో ఎలియాస్ యెమెర్ నెగ్గడంతో స్వీడన్ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక, చివరి మ్యాచ్‌లో శ్రీరామ్, లియో బోర్గ్ తలపడాల్సి ఉండగా దాన్ని నిలిపివేశారు. డేవిస్ కప్ చరిత్రలో స్వీడన్ చేతిలో భారత్‌కు ఇది 6వ పరాజయం. వచ్చే సీజన్‌లో వరల్డ్ గ్రూపు 1లో స్థానం కాపాడుకునేందుకు వచ్చే ఏడాది భారత భారత జట్టు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News