CSK: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ!.. అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు

చెన్నై సూపర్ కింగ్స్.. ఏపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టు. ధోని అధినాయకత్వంలో ఇప్పటి వరకు ఆ టీం 5 సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది.

Update: 2024-03-11 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టు. ధోని అధినాయకత్వంలో ఇప్పటి వరకు ఆ టీం 5 సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. 2013, 2015, 2017, 2019, 2020 ఇలా ఎడిషన్ ఏదైనా.. ఎలాంటి కఠిన జట్టైనా.. ఉత్కంఠ గొలిపే మ్యాచ్‌లలో సైతం ఒత్తిడి తలొగ్గకుండా ఐపీఎల్ ట్రోఫీలను ఎత్తిన చరిత్ర ఆ జట్టు సొంతం. అయితే, ప్రస్తుతం సీఎస్‌కే‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. దీంతో జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అతడు వెళ్లిపోతే జట్టును ఎవరు ముందుకు నడిపిస్తారనే భయం వారిలో మొదలైంది. కప్ సాధించడం అలా ఉంచితే.. జట్టు ఉనికే ప్రశ్నార్థకం అవుతుందేమోనని చెన్నై ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.

ఈ క్రమంలోనే భారత మాజీ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని కోరాడు. కాగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు విషయం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్‌ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు ఆ జట్టు యాజమాన్యం అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ పరిణాయంతో క్రీడా లోకం నెవ్వరబోతోంది. వ్యక్తిగతంగా రోహిత్ కూడా ఫ్రాచైజీ నిర్ణయాన్ని చాలా పర్సనల్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఆయన అభిమానులు కూడా ముంబై జట్టుకు హార్దిక్ కెప్టెన్ అవ్వడం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ధోని రిటైర్మెంట్‌ అయిన వెంటనే రోహిత్ శర్మ సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరాడు. 

Tags:    

Similar News