CPL 2023: డివిలియర్స్‌లా ఆడబోతే.. బంతి తగిలి హెల్మెట్ ఎగిరిపోయింది (వీడియో)

కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్, ట్రింబాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వింత ఘటన ఎదురైంది.

Update: 2023-08-27 14:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్, ట్రింబాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వింత ఘటన ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా సెయింట్ లూసియా కింగ్స్ బ్యాటింగ్ చేయగా.. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన జాన్సన్ చార్లెస్ (37)కు వింత అనుభవం ఎదురైంది. నైట్ రైడర్స్ స్టార్ పేసర్ డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో.. డివిలియర్స్ తరహా స్కూప్ షాట్ ఆడేందుకు చార్లెస్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. ఈ బంతి వచ్చి చార్లెస్ హెల్మెట్‌కు తగిలింది. దీంతో అతని హెల్మెట్ ఊడిపోయింది. వెనక్కు పడి వికెట్లు తగిలితే అతను హిట్‌వికెట్‌గా వెనుతిరగాల్సి వచ్చేది.

అయితే కొంత తెలివి చూపించిన చార్లెస్.. హెల్మెట్‌ను కాలితో పక్కకు తన్నేయడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ట్రింబాగో నైట్ రైడర్స్ బ్యాటర్లు తేలిపోయారు. ఖ్యారీ పీర్ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. దీంతో ఆ జట్టు 14.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. బంతితోపాటు బ్యాటుతోనూ రాణించిన సికందర్ రజాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ' అవార్డు దక్కింది.


Similar News