Smriti Mandhana: క్రికెట్ ‘దేవ‌త మంధాన’.. చైనీయుడి ఫొటో వైర‌ల్

స్టార్ క్రికెట‌ర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారని తెలిసిందే.

Update: 2023-09-26 12:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ క్రికెట‌ర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారని తెలిసిందే. త‌మ ఫేవ‌రెట్ ఆట‌గాళ్లను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తుంటారు కొంద‌రు ఫ్యాన్స్. తాజాగా 19వ ఆసియా గేమ్స్‌లో అలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన‌ ను చూసేందుకు చైనా అభిమాని ఒక‌రు 1,200 కిలోమీట‌ర్ల దూరం ప్రయాణించాడు. అందుకోసం ఏకంగా 1000 యువాన్‌లు(భార‌త క‌రెన్సీలో రూ.11,400) ఖ‌ర్చు పెట్టాడు.

అత‌డి పేరు జున్ యూ(Jin Yu). మంధాన ఆట చూడ‌డం కోసం బీజింగ్ నుంచి హంగ్జైకి వ‌చ్చాన‌ని అత‌ను చెప్పాడు. మంధాన ఆట అంటే ఇష్టం. ఆమె సూప‌ర్ క్రికెట‌ర్. ఆమె ఆట‌ను స్వయంగా చూడ‌డం కోసం ఇక్కడికి వ‌చ్చాను అని జున్ తెలిపాడు. అంతేకాదు ఫైన‌ల్ మ్యాచ్ స‌మ‌యంలో జున్ ‘మంధాన ది గాడెస్'(Mandhana The Goddess) అని రాసున్న ప్లకార్డ్ ప‌ట్టుకొని క‌నిపించాడు. దాంతో అత‌డి ఫొటోలు క్షణాల్లో వైర‌ల్ అయ్యాయి. బీజింగ్‌లో తాను చ‌దువుకున్న యూనివ‌ర్సిటీలో క్రికెట్ పాఠాలు చెప్పేవార‌ని, అలా త‌న‌కు ఈ ఆట గురించి కొంచెం తెలుస‌ని జున్ చెప్పుకొచ్చాడు.


Similar News