దీపక్ చాహర్‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించిన ధోనీ.. వీడియో వైరల్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో గుజరాత్‌ను చివరి బంతికి ఓడించిన చెన్నై చరిత్ర సృష్టించింది.
దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో గుజరాత్‌ను చివరి బంతికి ఓడించిన చెన్నై చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై పేసర్ దీపక్ చాహర్ చేసిన పని వైరల్ అవుతోంది. మ్యాచ్ గెలిచిన తర్వాత చెన్నై టీం సభ్యులంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే స్టార్ పేసర్ దీపక్ చాహర్ అందరి వద్దకు వెళ్లి తన జెర్సీపై వాళ్ల ఆటోగ్రాఫ్స్ తీసుకున్నాడు. చివరకు ధోనీ వద్దకు కూడా వెళ్లాడు. అయితే ధోనీ మాత్రం ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ససేమిరా అన్నాడు. చాహర్ జెర్సీపై సైన్ చేయనంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే పక్కనున్న వ్యక్తితో.. 'వీడు చేతుల్లోకి వచ్చిన క్యాచ్ పట్టుకోలేడు ఆటోగ్రాఫ్ కావాలంట' అనే మీనింగ్ వచ్చేలా ఏదో అన్నాడు. ఆ సమయంలో ధోనీ సైగలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే చివరకు అతన్ని చాహర్ కన్విన్స్ చేసి తన జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగలాల్సింది. మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను దీపక్ చాహర్ నేలపాలు చేశాడు. ఆ తర్వాత మరోసారి కూడా చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను చాహర్ అందుకోలేకపోయాడు. అంతకుముందు క్వాలిఫైయర్‌లో గిల్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన ముంబై భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. ధోనీ ఈ విధంగా మ్యాచ్ ముగిసిన తర్వాత అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Deepak Chahar came for autograph and MS Dhoni reaction 🤣🤣
— OFFICIAL_TERVEZOBO (@tervezobo) May 30, 2023
#MSDhoni𓃵 #ChennaiSuperKings #congratulationscsk #Jadeja #DeepakChahar @msdhoni #CSK #IPL2023 pic.twitter.com/ziDvKYQ7Bq