FIFA World Cup: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌‌లో సంచలనం.. అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్

ఫుట్‌బాల్‌ టోర్నీల్లో దక్షిణ కొరియా అమ్మాయి రికార్డు సృష్టించింది.

Update: 2023-07-26 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్‌ టోర్నీల్లో దక్షిణ కొరియా అమ్మాయి రికార్డు సృష్టించింది. ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీల్లో మ్యాచ్‌ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా కేసీ పెయిర్‌ (16 ఏళ్ల 26 రోజులు) రికార్డు సృష్టించింది. కొలంబియాతో మంగళవారం జరిగిన మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లో కేసీ పెయిర్‌ కొరియా తరఫున 78వ నిమిషంలో బరిలోకి దిగింది. గతంలో ఈ రికార్డు ఐఫెనీ చిజ్నీ (నైజీరియా 16 ఏళ్ల 34 రోజులు; 1999 ప్రపంచకప్‌లో) పేరిట ఉంది.


Similar News