BREAKING : ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం

ఒలింపిక్స్‌లో భారత్ రెండో పతకం గెలుచుకుని సత్తా చాటింది.

Update: 2024-07-30 08:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒలింపిక్స్‌లో భారత్ రెండో పతకం గెలుచుకుని సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. మను బాకర్, సరబ్ జోత్ జోతి కాంస్య పతకాన్ని సాధించి భారత్‌కు రెండో పతకాన్ని అందించారు. కొరియా జంటపై 16-10 తేడాతో భారత జోడీ గెలుపొందింది. ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి మను బాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే భారత్‌కు వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకాన్ని మను బాకర్ సాధించారు. 

ఇండియా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900లో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ ఒకేసారి రెండు పతకాలు సాధించాడు. ఇండియా తరఫున ప్రిచర్డ్ ప్రాతినిధ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు రెండు పతకాలను ఏ భారత అథ్లెట్ ఈ ఫీట్ సాధించలేదు. కాగా, తాజా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మన బాకర్ సరికొత్త చరిత్ర లిఖించారు. 

Tags:    

Similar News