Bhuvneshwar Kumar: సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తొలగింపు.. టీమిండియా పేసర్ కీలక నిర్ణయం!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన టీమిండియా పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ బయోలో మార్పు చేసి ఫాలోవర్లను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాడు.

Update: 2023-07-28 13:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన టీమిండియా పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ బయోలో మార్పు చేసి ఫాలోవర్లను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాడు. భువీ 2012లో టీమిండియా తరఫున అరంగేట్రం చేయగా.. పేస్‌ దళంలో ముఖ్యమైన సభ్యుడిగా జట్టుకు సేవలు అందించి ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే గతేడాది నవంబరులో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన 33 ఏళ్ల భువీని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితా నుంచి బీసీసీఐ ఇటీవలే తొలగించింది.

ఈ నేపథ్యంలో భువీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ బయోలో 'ఇండియన్‌ క్రికెటర్‌'ను 'ఇండియన్‌'గా మార్చుకోవడం విశేషం. ఇది గమనించిన ఫ్యాన్స్‌.. ‘‘అయ్యో ఇదేంటి భువీ! నువ్వు రీ ఎంట్రీ చేస్తావనని మేము బలంగా కోరుకుంటున్నాం. టీమిండియాకు నువ్వు చేయాల్సింది చాలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి రావాలి. ఇప్పుడే రిటైర్మెంట్‌ లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్‌.. అంటూ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. కాగా ఇన్‌స్టాలో 'ఇండియన్‌ క్రికెటర్‌' అన్న పదాలను తొలగించిన భువీ.. ట్విటర్‌లో మాత్రం కొనసాగించడం గమనార్హం. ఏదేమైనా ఈ సీనియర్‌ పేసర్‌ తన చర్యతో నెట్టింట వైరల్‌గా మారాడు.


Similar News