టీమిండియాకు ఆడాలంటే ప్రతి క్రికెటర్ ఆ పని చేయాల్సిందే.. ఆటగాళ్లకు తేల్చి చెప్పిన జై షా
టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ ఇటీవల దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దేశవాళీ లీగ్‌ల కన్నా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ ఇటీవల దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దేశవాళీ లీగ్‌ల కన్నా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కసారి ఐపీఎల్‌లో గుర్తింపు లభిస్తే.. డబ్బు, త్వరగా ఫేమ్ వస్తాయని ప్లేయర్స్ భావిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ఎంత రాణించినప్పటికీ ఎక్కువగా గుర్తింపు రాకపోవడంతో పాటు.. ఇండియా టీమ్‌లో కూడా ప్లేస్ అంత తర్వగా రాగా రాకపోవడంతో యంగ్ ప్లేయర్స్ ఎక్కువగా ధనాధన్ లీగ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఎక్కువగా ఐపీఎలే ఆడటంతో క్రికెటర్స్‌లో నైపుణ్యం తగ్గుతోందని క్రీడా విశ్లేషకులు, సీనియర్ క్రికెటర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచన చేశారు. టీమిండియా ప్లేయర్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల టీమిండియా క్రికెటర్స్ దేశవాళీ క్రికెట్ కంటే ఎక్కువగా ఐపీఎల్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని.. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని అన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటంలో నిర్లక్ష్యం వహించి.. ఐపీఎల్ ఆడేందుకు ఎక్కువ ఆసక్తి చూపించే ప్లేయర్లపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.
టీమిండియా జట్టులో సెలక్షన్‌కు దేశవాళీ క్రికెట్ ప్రదర్శననే పరిగణలోకి తీసుకుంటామని.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఫర్మామెన్స్ ఆధారంగానే టీమ్ ఎంపిక జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. టీమిండియాకు ఆడాలనుకునే ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఈ సందర్భంగా జై షా తేల్చిచెప్పారు. ఇటీవల ప్లేయర్స్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతోనేజై షా ఇంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.