ఈ నెల 18న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్
ఈ నెల 18న బీసీసీఐ 21వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ఈ నెల 18న బీసీసీఐ 21వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌ల స్పాన్సర్‌షిప్‌పై ప్రధాన చర్చ జరగనుంది. ‘20వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినట్స్‌ను నిర్దారించడం, బీసీసీఐ మ్యాచ్‌ల స్పాన్సర్షిప్, దేశీయ మ్యాచ్‌లను కవర్ చేయడానికి వీడియో పరికరాల కోసం సర్వీస్ ప్రొవైడర్ నియామకం, ప్రెసిడెంట్ చేర్చే ముఖ్యమైన ఇతర అంశాలు ఎజెండాలో ఉన్నాయి.’ అని బీసీసీఐ తెలిపింది. అలాగే, వన్డే ప్రపంచకప్‌ను విజయవంతంగా ఆతిథ్యమివ్వడంపై కూడా చర్చ జరగనుంది. కానీ, సమావేశం జరిగే వేదిక, సమయంపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. జులై 7న ముంబై వేదికగా చివరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది.