దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టును ప్రకటించిన BCCI.. కోహ్లీ, రోహిత్‌కు నో ప్లేస్
డిసెంబర్ 10వ తేదీన నుండి జనవరి 3వ తేదీ వరకు టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భారత్ 3 టీ20లు, 3వన్డేలు, 2 టెస్ట్ మ్యాచులు ఆడనుంది.
దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 10వ తేదీన నుండి జనవరి 3వ తేదీ వరకు టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా భారత్ 3 టీ20లు, 3వన్డేలు, 2 టెస్ట్ మ్యాచులు ఆడనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. టెస్ట్, వన్డే, టీ 20 సిరీస్‌లకు వేర్వేరు జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 సిరీస్‌లకు స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నారు. వైల్ బాల్ క్రికెట్‌కు కాస్త రెస్ట్ కావాలనే అడగటంతో ఆ ఇద్దరికి బీసీసీఐ విశ్రాంతి కల్పించింది.
రోహిత్, కోహ్లీ తిరిగి మళ్లీ టెస్ట్ సిరీస్‌తో జట్టుతో కలవనున్నారు. ఇక టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా జడేజా వ్యవహరించనున్నారు. వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండటంతో యధావిధిగా హిట్ మ్యాన్ టీమ్‌ను నడపనున్నాడు. టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా బ్రూమా ఎంపిక అయ్యాడు. గాయం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన బ్రుమా.. 17 నెలల తర్వాత టెస్ట్ జట్టులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
జట్ల వివరాలు:
2 టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వక్), రాహుల్ (wk), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, మొహమ్మద్. షమీ*, జస్ప్రీత్ బుమ్రా (VC), ప్రసిద్ధ్ కృష్ణ.
3 టీ20ల కోసం భారత జట్టు: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), రింకు కిషన్, ఇషాన్ ఇషాన్, శ్రేయస్షన్ , జితేష్ శర్మ (wk), రవీంద్ర జడేజా (VC), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
3 ODIలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకు సింగ్, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (C) సంజూ(wk), (wk), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.