బీసీసీఐ అధికారిక భాగస్వామ్యులుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీ..!
ఇండియా హోం సీజన్ కోసం అధికారిక భాగస్వామ్యులుగా కాంపా, ఆటమ్ బర్గ్ టెక్నాలజీలను ప్రకటించింది బీసీసీఐ.
దిశ, స్పోర్ట్స్: ఇండియా హోం సీజన్ కోసం అధికారిక భాగస్వామ్యులుగా కాంపా, ఆటమ్ బర్గ్ టెక్నాలజీలను ప్రకటించింది బీసీసీఐ. దేశీయ, అంతర్జాతీయ సీజన్స్ 2024-26కి అధికారిక భాగస్వామ్యులు ఇవే అని తెలిపింది.భారత క్రికెట్ స్థాయిని పెంచేందుకు రెండు స్వదేశీ బ్రాండ్స్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపింది బీసీసీఐ. అసమానమైనవి సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. క్రికెట్ పట్ల వారి నిబద్ధత ఈ భాగస్వామ్యానికి అద్దం పడుతోందన్నారు. అఫీషియల్ పాట్నర్స్ సహకారంపై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు బీసీసీఐ కార్యదర్శి జైషా. క్రికెట్ ప్రేమికులకు చిరస్మరణీయమైన అనుభవాలు సృష్టించేందుకు ఎదురుచూస్తున్నామన్నారు. ఈ భాగస్వామ్యాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కంపా, ఆటంబర్గ్ సహకారంతో స్వదేశీ క్రికెట్ సీజన్‌కు గణనీయమైన విలువను జోడిస్తుందన్నారు.