టీ20 వరల్డ్ కప్ ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ వార్నింగ్
టీమిండియాకు రాబోయే కొన్ని నెలలు కీలకంగా మారాయి. ఇంగ్లాండ్ తో టెస్టు, తర్వాత ఐపీఎల్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్.. జరగనుంది.
దిశ, స్పోర్ట్స్: టీమిండియాకు రాబోయే కొన్ని నెలలు కీలకంగా మారాయి. ఇంగ్లాండ్ తో టెస్టు, తర్వాత ఐపీఎల్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్.. జరగనుంది. ఇలాంటి టైంలో బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదేశాలు జారీ చేశారు బీసీసీఐ చీఫ్ జైషా. ఐపీఎల్ లో పాల్గొనే స్టార్లకు సంబంధించిన వాటిల్లో బీసీసీఐ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఫ్రాంచైజీలకు అల్టిమేటం జారీ చేశారు.
బీసీసీఐ అనేది అత్యున్నత సంస్థ అని.. బీసీసీఐ ఆదేశాలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు జైషా. ఫ్రాంచైజీలకన్నా బీసీసీఐ అత్యుత్తమంగా ఉందని.. అందుకే దాని ఆదేశాలు పాటించాలని వివరించారు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని ప్రకటన చేశారు.
ఇకపోతే భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాలనుకుంటే కనీసం 3 లేదా 4 రంజీ మ్యాచ్ లు ఆడటాన్ని బీసీసీఐ తప్పని చేసింది. ప్లేయర్లందరికీ ఇప్పటికే ఫోన్లలో సమాచారం అందించారు. సెలక్షన్ ఛైర్మన్, కోచ్, కెప్టెన్ కోరితే రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని లెటర్స్ కూడా రాయనున్నట్లు తెలిపారు జైషా.
మరోవైపు జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే అందరూ వ్యవహరించాలన్నారు. ఎన్సీఏ నుంచి ఏ సలహా వచ్చినా దాన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కేంద్ర కంట్రాక్టు ఆటగాళ్లందరికీ ఇది వర్తిస్తుందన్నారు. అందరు ప్లేయర్లు ఆడాల్సి ఉంటుందని.. లేకపోతే సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. సెలక్షన్ కమిటీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.