BAN vs NZ 3rd ODI: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ అరుదైన ఘనత.. నాలుగో బ్యాటర్‌గా..

Update: 2023-09-26 11:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మహ్మదుల్లా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోర్‌ 1 వద్ద వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో బంగ్లాదేశ్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మహ్మదుల్లాకు ముందు తమీమ్‌ ఇక్బాల్‌ (243 మ్యా​చ్‌ల్లో 8357 పరుగులు), ముష్ఫికర్‌ రహీమ్‌ (256 మ్యాచ్‌ల్లో 7406), షకీబ్‌ అల్‌ హసన్‌ (240 మ్యాచ్‌ల్లో 7384 పరుగులు) వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నారు. వన్డేల్లో బంగ్లాదేశ్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్‌లో మొత్తంగా 221 వన్డేలు ఆడిన మహ్మదుల్లా 3 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 5020 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో అతను 82 వికెట్లు పడగొట్టాడు.


Similar News