Babar Azam: క్రికెట్ చరిత్రలోనే సరికొత్త షాట్.. వీడియో వైరల్
కొలంబో వేదికగా శ్రీలంక వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టుబిగుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: కొలంబో వేదికగా శ్రీలంక వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టుబిగుస్తోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఓ సరికొత్త షాట్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. పాకిస్తాన్ ఇన్నింగ్‌లో అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో ఓ బంతిని.. బాబర్ వినూత్న షాట్‌తో స్లిప్ దిశగా బౌండరీ పంపాడు. ఫుల్ అండ్ ఔట్ సైడ్ పడిన బంతిని బాబర్ తన బ్యాట్‌ని పైకెత్తి వదిలివేయాలని తొలుత అనుకున్నట్లు కన్పించింది.
కానీ వెంటనే బాబర్ తన మైండ్ మార్చుకోని లేట్‌గా షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్, గల్లీ మధ్య నుంచి బౌండరీ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే బాబర్ ఆజం నెట్స్‌లో ఈ షాట్ ప్రాక్టీస్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Babar Azam played that shot intentionally and guided it for four. Root and Williamson play it too! Babar has mastered it and can play it whenever he wants to 💚
— Farid Khan (@_FaridKhan) July 26, 2023
Commentators don't follow Babar in the nets and it shows, they don't know a thing 👎 #SLvPAK https://t.co/4iyVqnmGgH pic.twitter.com/5JRkMb1W5n