ఆసిస్‌కు షాక్.. 22 ఏళ్ల తర్వాత పాక్‌ చారిత్రాత్మక విజయం

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను పాక్ కైవసం చేసుకుంది.

Update: 2024-11-10 11:59 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ జట్టు చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసిస్‌కు షాకిచ్చిన ఆ జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. దీంతో 22 ఏళ్ల తర్వాత కంగారుల గడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌ను దక్కించుకుంది. ఇంతకుముందు 2002లో చివరిసారిగా పాక్ 2-1తోనే గెలుపొందింది. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో పాక్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.

పాక్ బౌలర్లు చెలరేగడంతో ఆసిస్ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 31.5 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. అబ్బాట్ చేసిన 30 పరుగులే టాప్ స్కోర్. జేక్ ఫ్రేజర్(7), జోష్ ఇంగ్లిస్(7), స్టోయినిస్(8), మ్యాక్స్‌వెల్(0) విఫలమయ్యారు. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా మూడేసి వికెట్లు, హరీస్ రవూఫ్ రెండు వికెట్ల‌తో కంగారుల పతనాన్ని శాసించారు. అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ అలవోకగా ఛేదించింది. 26.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 143 స్కోరు చేసింది. సైమ్ అయూబ్(423), అబ్దుల్లా షఫీక్(37) శుభారంభం అందించగా.. కెప్టెన్ రిజ్వాన్(30 నాటౌట్), బాబర్ ఆజామ్(28 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. పాక్ కెప్టెన్ రిజ్వాన్‌కు ఈ సిరీస్ ఎప్పటికీ గుర్తుండిపోనుంది. సారథ్యం వహించిన తొలి సిరీస్‌‌లోనే విజయం సాధించడం, అది కూడా ఆసిస్ గడ్డపై కావడం అతని కెరీర్‌లో ప్రత్యేకంగా నిలువనుంది.

Tags:    

Similar News