Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత తొలిసారి గోల్డ్ ​మెడల్

ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ గోల్డ్ మెడల్​ సాధించింది.

Update: 2023-09-26 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ గోల్డ్ మెడల్​ సాధించింది. 41 ఏళ్ల తర్వాత మొదటి సారి ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ గోల్డ్ మెడల్​ అందుకోవడం విశేషం. ఈక్వెస్ట్రియన్‌ (గుర్రపు స్వారీ) డ్రెస్సేజ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్‌, హ్రిదయ్‌ చద్దా, అనుష్‌ అగర్వల్లాలతో కూడిన జట్టు 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్‌ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. మరోవైపు సెయిలింగ్‌లోనూ భారత్ అదరగొట్టింది. విష్ణు శరవణన్‌ రజతం కైవసం చేసుకున్నాడు. దీంతో సెయిలింగ్‌లో భారత్‌కు ఇది మూడో మెడల్‌.


Similar News