Asia Cup 2023: రేపు శ్రీలంకకు బయల్దేరనున్న రోహిత్ సేన..

ఆసియా కప్‌కు సమయం ఆసన్నమైంది.

Update: 2023-08-28 13:19 GMT

బెంగళూరు : ఆసియా కప్‌కు సమయం ఆసన్నమైంది. ఈ మినీ టోర్నీ బుధవారం నుంచే ప్రారంభంకానుంది. ఆసియా కప్‌‌కు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యమిస్తుండగా.. టీమ్ ఇండియా మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. ఆసియా కప్ Asia Cup 2023: రేపు శ్రీలంకకు బయల్దేరనున్న రోహిత్ సేన..కోసం భారత క్రికెటర్లు బెంగళూరు సమీపంలోని అలూరులో క్యాంప్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదివారం విశ్రాంతి ఉన్నప్పటికీ.. టీమ్ మీటింగ్స్ డెక్సా టెస్టుల్లో పాల్గొన్నారు. సోమవారం సైతం చెమటోడ్చారు. మంగళవారం భారత క్రికెటర్లు క్యాంప్ నుంచి నేరుగా శ్రీలంకకు బయల్దేరనున్నారు.

బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఆసియా కప్‌కు సిద్ధంగా ఉన్నాడు. అలాగే, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే సందిగ్ధత నెలకొంది. అతను అందుబాటులో లేకపోతే యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చాన్స్ దక్కనుంది. కాగా, ఆసియా కప్‌‌ టోర్నీని భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌ను ఢీకొట్టడంతో ఆరంభించనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది.


Similar News