మహ్మద్ సిరాజ్ విజయం వెనుక కోహ్లీ కృషి.. ఎలాగో తెలుసా?
ఆసియా కప్ ఫైనల్‌లో ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ శ్రీలంక వెన్నువిరిచాడు. ఆదివారం ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్ టాపిక్.
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌లో ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ శ్రీలంక వెన్నువిరిచాడు. ఆదివారం ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్ టాపిక్. ఈ హైదరాబాదీ ఫాస్ట్‌బౌలర్ భారత వన్డే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రదర్శన చేశారు. అతని ధాటికి ఆతిథ్య జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఒకే ఓవర్లో 4 వికెట్లు, తీసి మొత్తంగా 6 వికెట్లతో శ్రీలంక బాటర్ లకు షాకిచ్చాడు సిరాజ్. ఈ ఒక్క మ్యాచ్ అని కాదు. కొంత కాలంగా సిరాజ్ పర్ఫామెన్స్ గొప్పగా సాగుతోంది. ఒకప్పుడు ఇతడికి జట్టులో చోటు అవసరమా అని విమర్శలు ఎదుర్కొన్నవాడు. ఇప్పుడు టీమ్‌ఇండియాలో ప్రధాన పేసర్లలో ఒకడిగా ఎదగడం వెనుక మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగో తెలియాలంటే కింద ఉన్న ఈ వీడియోను చూడండి.