Asia Cup 2023: 'ధోనీ, యువీ లేని లోటును తీర్చే బాధ్యత వారిద్దరిదే'

Asia Cup 2023లో టీమ్‌ ఇండియా నాలుగో స్థానంపై భారత సీనియర్‌ ఆటగాడు అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Update: 2023-08-25 12:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: Asia Cup 2023లో టీమ్‌ ఇండియా నాలుగో స్థానంపై భారత సీనియర్‌ ఆటగాడు అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐదో స్థానంలో వచ్చే బ్యాటర్‌పై మరిన్ని బాధ్యతలు ఉంటాయని.. దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, యువ్‌రాజ్‌ సింగ్‌ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఈ స్థానం కోసం భారత్‌ సరైన ఆటగాడిని రీప్లేస్ చేయలేకపోయిందని వ్యాఖ్యానించాడు. యువీ నాలుగో స్థానంలో.. ధోనీ ఐదో స్థానంలో క్రీజ్‌లోకి రావడం వల్ల భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉండేదని గుర్తు చేశాడు. ఇప్పుడు మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్‌ ఇలాంటి పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తప్పకుండా ఐదో స్థానంలో సరిపోతాడనిపిస్తోంది. రిషభ్ పంత్ గాయపడకుండా ఉంటే పరిస్థితి విభిన్నంగా ఉండేది. ఎడమచేతి వాటం బ్యాటర్‌ కావడంతోపాటు దూకుడుగా ఆడే పంత్‌ జట్టులో ఉంటే మరింత కలిసొచ్చేది. కేఎల్ రాహుల్‌ ఎంత ముఖ్యమో శ్రేయస్‌ అయ్యర్ కూడా కీలక ఆటగాడు. భారత బ్యాటింగ్‌ లైనప్‌లో అత్యుత్తమ ఆటగాడు అయ్యర్. నాలుగో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. స్పిన్‌ను కూడా సమర్థంగా ఆడతాడు. గతంలోనూ ఇదే స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తే నాలుగో స్థానానికి ఢోకా ఉండదు’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. మిడిలార్డర్‌ బలంగా ఉంటే ఎలాంటి జట్టునైనా ఓడించే అవకాశం ఉంటుంది. ఆసియా కప్‌ కోసం బరిలోకి దిగనున్న భారత జట్టులోనూ శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్‌పై క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Tags:    

Similar News