Ashes 2023: అరుదైన మైలురాయిని చేరుకోనున్న స్టీవ్‌ స్మిత్‌

Update: 2023-07-04 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: జులై 6 నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్ట్‌ మ్యాచ్‌‌లో ఆడనున్న ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 40 మంది ఆటగాళ్లు 100 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన ఘనతను సొంతం చేసుకోగా.. Ashes Series 3rd Test మ్యాచ్‌తో స్మిత్‌ వీరి సరసన చేరనున్నాడు. ఆసీస్‌ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్‌ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కానున్నాడు. కెరీర్‌లో 99 టెస్ట్‌లు ఆడిన స్మిత్‌.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9,113 పరుగులు చేశాడు.


Similar News