ENG Vs AUS 5th Test: ఐదో టెస్టు.. టాస్ గెలిచిన ఆసీస్..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. కామెరాన్ గ్రీన్ ఈ టెస్టుకు దూరం కావడంతో అతని స్థానంలో స్పిన్నర్ టాడ్ మర్ఫీ తుదిజట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. బెన్ డకెట్ 29, జాక్ క్రాలీ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిచి 2-2తో సిరీస్ సమం అయినా యాషెస్ ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా వద్దనే ఉంటుంది.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):
జాక్ క్రాలే, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, టాడ్ మర్ఫీ