మద్యం నన్ను చంపేస్తుందని భయపడ్డా : సినాలో జఫ్తా

సౌతాఫ్రికా మహిళా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సినాలో జఫ్తా తన గతం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. జఫ్తా క్రికెట్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు.

Update: 2024-10-13 20:03 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా మహిళా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సినాలో జఫ్తా తన గతం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. జఫ్తా క్రికెట్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఆమె మానసిక, శారీరక ఆరోగ్యం విషయానికి వస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2019లో అంతర్జాతీయ జట్టులో తిరిగి అడుగుపెట్టిన తర్వాత 29 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ ‘మద్యపానం’ తీసుకోవడం వలన తన జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చిన కఠిన పరిస్థితుల గురించి ఐసీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది.

‘ఆల్కహాల్ అలవాటు నుంచి బయట పడేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లో చేరిన సమయంలో తోటి వ్యక్తులు నన్ను ‘అహంకారి’, ‘స్వార్థపరురాలిగా’ పిలిచేవారు. నేను తరచుగా మద్యం సేవించను. కానీ, నేను చాలా ఎక్కువగా తాగాను. 2022లో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నట్లు నాకు కూడా గుర్తులేదు’. నేను పునరావాసంలో చేరాక మద్యపానానికి బానిసనని అంగీకరించలేదు. నేను నా క్రికెట్ కెరీర్‌ను కోల్పోతే ఎలా ఉంటుందో గ్రహించాను. ఇది నేను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్న నా జీవితం. నేను కెరీర్‌లో తిరిగి వచ్చినా గతాన్ని మర్చిపోలేను’ అని జాఫ్తా ఐసీసీకి వివరించారు.

Tags:    

Similar News