ఆసియా కప్ చరిత్రలో రోహిత్ రికార్డును బద్దలు కొట్టిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ చరిత్రలో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఆసియా కప్ చరిత్రలో అత్యధిక స్కోరు
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ చరిత్రలో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఆసియా కప్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన రోహిత్ శర్మ రికార్డును రహ్మానుల్లాహ్ గుర్బాజ్ బద్దలు కొట్టాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ శనివారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 84(45) పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ చరిత్రలో ఇదే ఎక్కువ స్కోర్ గా నిలిచింది. కాగా ఇంతకు ముందు భారత బ్యాటర్ రోహిత్ శర్మ 2016లో బంగ్లాదేశ్‌పై 55 బంతుల్లో 83 పరుగులు చేశాడు.