ఒలంపిక్ విజేతల నజరానాల మీద టాక్స్?

ఒలంపిక్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, సంస్థలు.. నగదు బహుమతులు, ఇతర కానుకలు ప్రకటించాయి.

Update: 2024-08-14 10:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఒలంపిక్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, సంస్థలు.. నగదు బహుమతులు, ఇతర కానుకలు ప్రకటించాయి. మరి వీటిపై కూడా మన విజేతలు ప్రత్యేక పన్నులు కట్టాలా? సాధారణంగా పారిస్ ఒలంపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఒలంపిక్స్ నుండి బంగారు పతకానికి మన కరెన్సీలో రూ.80 వేలు, రజత పతకానికి రూ.40 వేలు, కాంస్య పతకానికి రూ.20 వేలు లభిస్తాయి. వీటిలోనే పన్నులన్నీ కట్ చేస్తారు. కానీ మనదేశపు అథ్లెట్ల విషయంలో కొన్ని అంశాలు మాత్రమే పన్ను పరిధిలోకి వస్తాయి. 2014 లో విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ పన్నులపై స్పష్టతనిచ్చింది. ఒలంపిక్, కామన్ వెల్త్, ఆసియా క్రీడలు, ప్రపంచ క్రీడలతోపాటు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇచ్చే నగదు, ఇతర బహుమతులకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(17) నుండి మినహాయింపు ఉంటుంది. అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుండి లభించే నగదు లేదా వస్తువుల రూపంలో వచ్చే బహుమతులు రూ.50 వేలు దాటితే అవి పన్ను పరిధిలోకి వస్తాయి. వీటిపై పన్నులు కట్టాల్సి ఉంటుంది. ఇక భారత్ కు మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా విషయంలో.. బింద్రాకు లభించిన ప్రభుత్వ అవార్డులు, రివార్డులు పన్నుల పరిధిలోకి రావని 2018 లో ఆదాయపు అప్పీలేట్ ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది. కాబట్టి ఒలంపిక్స్ లో వ్యక్తిగత పతకాలు, జట్టుగా సాధించిన పతక దారులకు లభించిన ప్రభుత్వ రివార్డుల్లో ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని లేదు. కాని వారికి ఇతర సంస్థలు, వ్యక్తులు ప్రకటించిన బహుమతులు, రివార్డులపై 50% తప్పకుండా పన్ను కట్టాల్సి ఉంటుంది. కామన్ పీపుల్ కి వారికి అనేక నగదు బహుమతులు, కార్లు, ఇళ్ల స్థలాలు లాంటివి లభించాయని నోరు వెళ్లబెడతారు కానీ వాటి వెనుక కట్టే పన్ను పోట్ల సంగతి మాత్రం ఎవరికీ తెలియదు.  


Similar News