వరల్డ్ కప్ ముందు పాకిస్తాన్ కు భారీ షాక్
ఆసియా కప్ 2023 లో భాగంగా జరిగిన సూపర్ ఫోర్ మూడో మ్యాచులో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అలాగే వచ్చే నెలలో రానున్న ప్రపంచ కప్ ముందు ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 లో భాగంగా జరిగిన సూపర్ ఫోర్ మూడో మ్యాచులో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అలాగే వచ్చే నెలలో రానున్న ప్రపంచ కప్ ముందు ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. సోమవారం జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో.. పాక్ కీలక పేసర్లు రాణిస్తున్న హరీష్ రౌఫ్, నసీమ్ షా లు.. గాయపడ్డారు. దీంతో వారిద్దరూ పూర్తి స్పెల్ వేయకుండానే మ్యాచ్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఇద్దరు బౌలర్లు కూడా ఆసియా కప్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారు ప్రస్తుతం మెడికల్ ప్యానెల్ పర్యవేక్షణలో ఉన్నారు. ఒక వేళ వారు గాయాల నుంచి కోలుకోలేక పోతే మాత్రం వరల్డ్ కప్ కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే వారిని ఆసియా కప్ లో ఆడించి రిస్క్ చేయోద్దని కోచ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మిగిలిన మ్యాచుల్లో హరీష్ రౌఫ్, నసీమ్ షా స్థానాలను ఎవరు భర్తీ చేస్తారో వేచి చూడాలి మరి.