మ్యాచ్ అనంతరం స్టేడియంలో ఘోరం.. 129 మంది దుర్మరణం (వీడియో)

ఇండోనేషియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దారుణం చోటుచేసుకుంది. మ్యాచ్‌ అనంతరం ఓటమిని జీర్ణించుకోలేకపోయిన క్రీడాభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది.

Update: 2022-10-02 01:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దారుణం చోటుచేసుకుంది. మ్యాచ్‌ అనంతరం ఓటమిని జీర్ణించుకోలేకపోయిన క్రీడాభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అభిమానులను కంట్రోల్ చేసేందుకు టియర్ గ్యాస్ ఉపయోగించారు. దీంతో ఫ్యాన్స్ అంతా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు టియర్ గ్యాస్ కారణంగా గాలిలో ఆక్సిజన్ అందక ఏకంగా 129 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా అభిమానులు గాయపడ్డట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి అరెమా – పెర్సెబయా జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అరెమా జట్టు పెర్సెబయ జట్టు చేతిలో ఓడిపోయింది. అంతకముందు మ్యాచ్‌ మధ్యలో ప్లేయర్ల మధ్య వివాదం జరిగింది. దీంతో మ్యాచ్ అనంతరం ఓటమి భరించలేకపోయిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకొచ్చారు. దీంతో వారిని అదుపుచేసేందుకు తప్పనిసరి టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. చనిపోయిన 129 మందిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారన్నారు. 34 మంది స్టేడియం లోపల మరణించారని.. మిగిలిన వారు ఆసుపత్రిలో మరణించారని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Tags:    

Similar News