ఇండియాలో బ్రిక్స్ గేమ్స్: మంత్రి రిజిజు
దిశ, స్పోర్ట్స్: ఖేలో ఇండియా గేమ్స్‌తో పాటు 2021లో బ్రిక్స్(Brazil, Russia, India, China, South Africa) క్రీడలు(Games) నిర్వహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiran Rijiju) అన్నారు. మంగళవారం బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల(sports ministers)తో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. 2021లో బ్రిక్ దేశాల అధ్యక్ష పీఠం ఇండియా(India)కు లభించబోతున్నది. దీంతో అదే ఏడాది ఈ ఐదు దేశాల క్రీడలను నిర్వహించాలని భారత్(India) ప్రణాళికలు […]
దిశ, స్పోర్ట్స్: ఖేలో ఇండియా గేమ్స్‌తో పాటు 2021లో బ్రిక్స్(Brazil, Russia, India, China, South Africa) క్రీడలు(Games) నిర్వహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiran Rijiju) అన్నారు. మంగళవారం బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల(sports ministers)తో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. 2021లో బ్రిక్ దేశాల అధ్యక్ష పీఠం ఇండియా(India)కు లభించబోతున్నది. దీంతో అదే ఏడాది ఈ ఐదు దేశాల క్రీడలను నిర్వహించాలని భారత్(India) ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఖేలో ఇండియా గేమ్స్(Khelo India Games) సమయంలోనే ఈ బ్రిక్((BRICS) గేమ్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్(University Games) జరిగే షెడ్యూల్‌లోనే బ్రిక్స్ గేమ్స్ చేర్చడం ద్వారా అన్ని దేశాల క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుందని మంత్రి రిజిజు స్పష్టం చేశారు. అన్ని బ్రిక్ దేశాలు తమ సాంప్రదాయ క్రీడలను ఈ సందర్భంగా ప్రపంచానికి తెలియజేసే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.