విదేశీ కోచ్‌ల పదవీకాలం పొడిగింపు

దిశ, స్పోర్ట్స్: విదేశీ కోచ్‌ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్ణయం తీసుకున్నది. టోక్యో ఒలింపిక్స్ కోసం పలు ఈవెంట్లకు విదేశీ కోచ్‌లను నియమించింది. కరోనా కారణంగా ఒలింపిక్స్ ఏడాదికాలం వాయిదా పడ్డాయి. కోచ్‌ల కాంట్రాక్టు గడువును కూడా మరో ఏడాది పొడిగించినట్లు సాయ్ స్పష్టం చేసింది. 11 క్రీడాంశాలకు 32 మంది విదేశీ కోచ్‌ల పదవీకాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించింది. వీరిని టోక్యో ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా […]

Update: 2020-07-23 08:02 GMT

దిశ, స్పోర్ట్స్: విదేశీ కోచ్‌ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్ణయం తీసుకున్నది. టోక్యో ఒలింపిక్స్ కోసం పలు ఈవెంట్లకు విదేశీ కోచ్‌లను నియమించింది. కరోనా కారణంగా ఒలింపిక్స్ ఏడాదికాలం వాయిదా పడ్డాయి. కోచ్‌ల కాంట్రాక్టు గడువును కూడా మరో ఏడాది పొడిగించినట్లు సాయ్ స్పష్టం చేసింది. 11 క్రీడాంశాలకు 32 మంది విదేశీ కోచ్‌ల పదవీకాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించింది. వీరిని టోక్యో ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా నియమించారు. లక్ష్యం పూర్తికాకుండా తప్పించడం భావ్యం కాదని, అందుకే వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పదవీకాలం పొడిగిస్తున్నామని సాయ్ అధికారులు తెలిపారు. పదవీకాలం పొడిగించిన వారిలో బాక్సింగ్ కోచ్‌లు శాంటియాకో నియోవా, రఫాలే బెర్గమస్కో, పురుషుల హాకీ కోచ్ గ్రాహమ్ రీడ్, షూటింగ్ కోచ్ స్మిర్నోవ్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News